విమానం లో ప్రయాణించేవారికి శుభవార్త
- June 08, 2016
విమాన ప్రయాణికులకు నిజంగా ఇది శుభవార్తే. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు బేస్ ఫేర్‌ని మించి ఉండకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. విమాన యాన సంస్థలకు చెప్పింది. దీంతో ఎవరైనా టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే సర్వీస్ ట్యాక్స్, ఎయిర్పోర్ట్ ఛార్జీలు, బుకింగ్ సైట్ ఛార్జీలు.. తదితరాల్ని తప్పకుండా వెనక్కి ఇస్తారని మీడియా నివేదికల్లో వెల్లడైంది. ఆ వివరాల ప్రకారం.. విమానయాన సంస్థలకు డీజీసీఏ కొత్త నిబంధనల్ని రూపొందించింది. వాటిపై ఇప్పటికే ఆ సంస్థలతో చర్చిస్తోంది. కేంద్ర విమాన యాన సంస్థ కొత్త నిబంధనలపై త్వరలోనే ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
ఇండిగో సంస్థ టిక్కెట్ రద్దుకి స్లాబ్ సిస్టంని అనుసరిస్తోంది. ఏ టిక్కెట్ రద్దు చేసుకున్నా రూ.2,250 ఛార్జీని వసూలు చేస్తోంది. ఎయిర్ ఇండియా.. ఫిబ్రవరి నుంచి క్యాన్సిలేషన్ ఛార్జీల్ని రూ.500 పెంచింది. ఇప్పుడు ప్రతి టిక్కెట్‌పై రూ.2,000 క్యాన్సిలేషన్ ఛార్జీల్ని వసూలు చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







