'మిస్టర్ ఇడియట్' టీజర్ రిలీజ్
- May 10, 2024
హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. పెళ్లి సందడి ఫేమ్ దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ శర్మ హీరోయిన్. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జెజే ఆర్ రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రవితేజ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య ( సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్లను ఎంతో అద్భుతం గీస్తుంటుంది. కాలేజ్‌లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి సమయంలో హీరో (మాధవ్) కాలేజ్‌లోకి అడుగుపెడతాడు. సత్యను గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్ను హీరో గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







