మహిళా శిరోమణి

- May 13, 2024 , by Maagulf
మహిళా శిరోమణి

ఇలలోనే నిస్వార్థ త్యాగాల నిలయము
సత్వరమే స్పందించే సున్నిత కుసుమము
కాఠిన్యం చూపినా హత్తుకొనే వాత్సల్యము
తన ఆలోచనే వారుగా బతికే మాతృబంధము
వర్ణించటానికి భాషలున్న భావాలు అనంతము .....

అవనిలోనే వెలకట్టలేని మణిహారము
అనునిత్యం బిడ్డలకై పరితపించే ఆరాటము
అణువణువున ప్రతిబింబించే లావణ్యము 
అవరోధాలని లెక్కచేయలేని ఔన్నత్యము
ఆకాశమంత విశాలమైన హృదయము ......

మమతలన్ని మూటకట్టి గోరుముధ్ధగా
చేసి ముధ్ధలపెట్టి ముద్దులతో మురిపించేది 
ఆటపాటలతో నెలవంకనే ఇల దించి
జోలపాడి జ్ఞానాన్ని నూరిపోసే గురువుగా 
వారి ఆకలిని తీర్చి  వారే తన లోకంగా 
జీవిస్తూ తనప్రేమతో యావత్ లోకాన్ని మరపించేది.....

ఎదలోతుల్లో ఎనలేని మాధుర్యంతో 
ఏడ్చిన వేళ తల్లడిల్లుతూ స్వాంతన చేకూర్చి
ఎంత ఎదిగినా పొత్తిళ్ళలో పొదివి హత్తుకొని
ఏమి ఆశించక తుదిశ్వాస వరకు వాయువులో
లీనమైన బిడ్డల భవితవ్యంకి ఎన్నో ఆటుపోట్లను 
ఎదుర్కొనే మహిళా శిరోమణి

--యామిని కోళ్ళూరు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com