సోంపు గింజల్ని జీలకర్రతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది.?

- May 13, 2024 , by Maagulf
సోంపు గింజల్ని జీలకర్రతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది.?

సోంపు, జీలకర్ర ఏదైనా సరే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దోహదపడతాయ్. కమ్మని భోజనం కడుపు నిండా తినేశాకా, ఆఖరిలో సోంపును తింటాం.
సోంపు తినడం వల్ల పంటి శుభ్రంతో పాటూ, కడుపు కూడా శుభ్రం అవుతుంది. ఎంత ఎక్కువగా తిన్నా ఆహారం ఈజీగా జీర్ణమైపోవడానికి సోంపు గింజలు సహాయ పడతాయ్.
సోంపులోని థైమోల్ జీర్ణ కండరాలను సడలించడం.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్రతో కలిపి సోంపును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి పూట నానబెట్టిన సోంపు, జీలకర్ర నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా వుండడంతో పాటూ, కొవ్వు కూడా కరుగుతుంది.
అంతేకాదు, బరువు తగ్గించే క్రమంలో వర్కవుట్లు చేసేవారు సైతం ఈ నీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అంతేకాదు, సోంపును రోజూ తినడం వల్ల దంతాల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. సో, సువాసనలూరే సోంపును కేవలం విందు భోజనాల్లో మాత్రమే కాదండోయ్. ప్రతీరోజూ భుజించొచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com