తెలుగమ్మాయ్ బోల్డ్ కామెంట్స్.!

- May 13, 2024 , by Maagulf
తెలుగమ్మాయ్ బోల్డ్ కామెంట్స్.!

ఎప్పటికపుడే తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో సందడి చేస్తూనే వుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన మరో తెలుగమ్మాయ్ సాహితి దాసరి.
‘భోళా శంకర్’ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. లేటెస్ట్‌గా ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో క్రేజ్ దక్కించుకుంది.
రాముల పాత్రలో చాలా అందంగా కనిపించిందీ తెలుగమ్మాయ్. అలాగే, సోషల్ మీడియాలోనూ అందాల ఫోటోలతో క్రేజీ ఫాలోయింగ్ దక్కించుకుంటోంది.
అవకాశం వస్తే ఎలాంటి రోల్ అయినా చేయడానికి సిద్ధమే అంటోంది. ఎక్స్‌పోజింగ్ విషయానికి వస్తే, కాస్త లిమిట్స్ వున్నాయంటోంది కానీ, కంటెంట్, రోల్ డిమాండ్ చేస్తే హద్దులు దాటేయడానికి సిద్ధమే అంటోంది సాహితి దాసరి.
తాజాగా బోల్డ్ పాత్రలు చేయడంపై అమ్మడి అభిప్రాయమేంటని ప్రశ్నించగా.. బోల్డ్ రోల్స్ చేయడమంటే అంత ఈజీ కాదు. మాట్లాడేసినంత సింపుల్ కాదు.
వాస్తవానికి బోల్డ్ అంటే అర్ధం విచ్చలవిడి ఎక్స్‌పోజింగ్ కాదు. చాలా స్ట్రాంగ్ అయిన రోల్‌ పోషించడమే బోల్డ్ పాత్రకు అసలు సిసలు అర్ధం.. అంటొంది. సో అలాంటి పాత్ర వస్తే ఖచ్చితంగా చేసేందుకు తాను రెడీ అని ఈ తెలుగమ్మాయ్ బోల్డ్ పాత్రకు సరికొత్త అర్ధం చెప్పింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com