ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- May 15, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గత 4 విడతల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలింగ్ వివరాలు వెల్లడించారు.
ఈవీఎంల ద్వారా 80.66, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ జరిగిందన్నారు. అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం ఓటింగ్ నమోదయినట్టు చెప్పారు.
- 3500 పోలింగ్ కేంద్రాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది.
- సాయంత్రం 4 గంటల తరువాత ఎక్కవమంది ఓటర్లు క్యూలైన్ లోకి వచ్చారు.
- వర్షం, లేట్ పోలింగ్ వంటి కారణాల వల్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ నడిచింది.
- అబ్జర్వర్లు రీపోలింగ్ రికమెండ్ చేయలేదు. ఈవీఎంలను 32 లొకేషన్లలో 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచాం.
- స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచల భద్రత కల్పించాం.
- అభ్యర్థులకు చెందిన వ్యక్తి కూడా అక్కడ కాపలా వుండవచ్చు.
- అసెంబ్లీ కంటే పార్లమెంట్ కు 227 ఓట్లు ఎక్కవ వచ్చాయి.
- 1 శాతం ఓట్లు పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చాయి.
- దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ జరిగింది.
- ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కవ పోలింగ్ జరిగింది.
- తిరుపతిలో బోగస్ ఓట్లు తొలగించాం. దీంతో గత ఎన్నికల కంటే పర్సెంటేజ్ కాస్తా తగ్గింది.
- పోలింగ్ ముగిసిన తరువాత వైలెన్స్ జరిగింది.
- తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావు పేటలో వైలెన్స్ జరిగింది.
- ముఖ్య నేతలను హౌజ్ అరెస్ట్ చేశాం.
- 9 చోట్ల ఈవీఎంలను ద్వంసం చేశారు. బాధ్యులను 2 రోజుల్లో అరెస్ట్ చేయాలి.
- రాష్ట్రంలో గొడవలు జరిగిన చోట్ల మొత్తంగా 715 పికెట్స్ పెట్టాం.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







