స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- May 15, 2024
న్యూ ఢిల్లీ: కాంటాక్ట్‌లో లేని నంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేయగానే.. లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ కావాలా అని అడుగుతుంటారు. ఒక్కోరోజు ఈ తరహా కాల్స్ పదుల సంఖ్యలో వస్తుంటాయి.
ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వస్తే చిరాకు, కోపం వచ్చేస్తుంటుంది. ఈ తరహా కాల్స్‌ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఇలాంటి కాల్స్ నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించింది. రిజిస్టర్ కానీ మొబైల్ నంబర్లు, అన్‌వాంటెండ్ కాల్స్ నియంత్రణకు ఇందులో పరిష్కారాలను ప్రతిపాదించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఇలాంటి కాల్స్ నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు జరిమానాలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక టెలికాం కంపెనీలు కాల్స్‌ను గుర్తించడానికి వీలుగా వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు మూడు వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నారు. మార్కెటింగ్ కాల్స్‌కు 140, సర్వీస్ కాల్స్ కోసం 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం 111 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్లు ప్రతీ కాలర్ పేరు, సెక్టార్‌తో సహా బహిర్గతం చేయాల్సిఉంటుంది. దీంతో వినియోగదారులు వారికి వచ్చే కాల్స్‌ను తిరస్కరించాలా? వద్దా? అని వారే నిర్ణయించుకోవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ టెలికాం సంస్థలతో గత వారంలో చర్చలు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలు రూపొందించిందని సమాచారం.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!