అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- May 15, 2024అమెరికా: అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లినప్పటికీ ఆ జాబ్ శాశ్వతంగా ఉంటుందో ఉండదోనంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇటీవలే గూగుల్, టెస్లా, వాల్‌మార్ట్ తో పాటు అటువంటి ప్రధాన సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. హెచ్1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ఈ తొలగింపులు.
ఉద్యోగాల నుంచి తీసేసిన హెచ్-1బీ వీసాదారుల కోసం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ-యూఎస్‌సీఐఎస్ తాజాగా తమ దేశంలో కొంత కాలం ఉండేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. హెచ్1బీ వీసాలు ఉండి ఉద్యోగాలు కోల్పోయిన వారికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
కొత్త గైడ్‌లైన్స్....
- గ్రేస్ పీరియడ్(60 రోజుల)లోపు నాన్‌ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.
- స్టేటస్ అప్లికేషన్‌ను సర్దుబాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి.
- ఉద్యోగులు ఒక ఏడాది ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత పొందడానికి అందుకు తగ్గ కంపెల్లింగ్ సర్కంస్టాన్సెస్(అనుకోని పరిస్థితుల) కింద దరఖాస్తు చేసుకోవాలి.
- పనిచేసే సంస్థను మారేందుకు పిటిషన్ దాఖలు చేసుకోవాలి.
హెచ్1బీ వీసాలున్న ఉద్యోగులు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినా వీటి ద్వారా అధికారికంగా అమెరికాలో కొంత కాలం పాటు ఉండొచ్చు. అర్హత ఉన్న నాన్ ఇమ్మిగ్రెంట్‌లు కొత్త వీసా పిటిషన్ దాఖలు చేయగానే ఇతర సంస్థలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆరు నెలల స్టేటస్ పెండింగ్ గడువు ముగిశాక వారి స్టేటస్ దరఖాస్తును కొత్త సంస్థ ఉద్యోగ ఆఫర్ పై సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!