'దుబాయ్ అన్‌లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- May 16, 2024
యూఏఈ: గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ సమగ్రతను కాపాడటంలో అత్యంత సీరియస్‌గా ఉన్నట్లు యూఏఈ ప్రకటించింది. ఇటీవల మనీ లాండరింగ్‌పై పోరాడుతున్న అంతర్జాతీయ సంస్థ నుండి ప్రశంసలు కూడా పొందినట్లు యూఏఈ అధికారి ఒకరు వెల్లడించారు. "ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో కొంతమందికి సురక్షితమైన స్వర్గధామంగా దుబాయ్ ఉంది. కొంతవరకు దాని రియల్ ఎస్టేట్ రంగం అందించే గోప్యత కారణంగా" అని పేర్కొన్న ఒక నివేదికను తీవ్రంగా తప్పుబట్టారు. గ్లోబల్ క్రిమినల్స్ అని పిలవబడే వారిని అడ్డుకోవడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుందన్నారు. ఫిబ్రవరిలో (ఈ సంవత్సరం), మనీలాండరింగ్‌తో పోరాడటానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) ప్రశంసించిందని తెలిపారు. యూఏఈ అమలు చేయబడిన చట్టపరమైన నిబంధనల ప్రకారమే దుబాయ్ లో ఆస్తుల కొనుగోలు ప్రతిపాదనపై సంతకం చేసినప్పుడు అతను/ఆమె తన పాస్‌పోర్ట్ కాపీలు మరియు ఎమిరేట్స్ IDతో సహా అతని/ఆమె అన్ని పత్రాలను అందించాలి. తాము కొనుగోలుదారు యొక్క గుర్తింపు మరియు వారి నిధుల మూలానికి సంబంధించిన సమాచారాన్ని మరియు డిపాజిట్ కోసం చెల్లింపును కఠినంగా పరిశీలిస్తామని అజీజీ డెవలప్‌మెంట్స్ సీఈఓ ఫర్హాద్ అజీ వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







