అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!

- May 16, 2024 , by Maagulf
అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!

రియాద్: అనుమతి లేకుండా హజ్ చేసినందుకు మక్కాలోకి ప్రవేశిస్తే SR100,000 వరకు జరిమానా విధిస్తామని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. జూన్ 2కు సంబంధించిన ధుల్ ఖదా 25, 1445 నుండి జూన్ 20కి సంబంధించిన ధుల్ హిజ్జా 14 వరకు, హజ్ అనుమతి లేకుండా మక్కాలోకి ప్రవేశించిన వారిపై SR10,000 జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పవిత్ర నగరం మక్కా, సెంట్రల్ హరమ్ ప్రాంతం, పవిత్ర స్థలాలైన మినా, అరాఫత్ మరియు ముజ్దలిఫా, రుసైఫాలోని హరమైన్ రైలు స్టేషన్, భద్రతా నియంత్రణ కేంద్రాలు, యాత్రికుల సమూహ కేంద్రాల పరిధిలో హజ్ అనుమతి లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలు విధించబడతాయని తెలిపింది.  పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాను రెట్టింపు చేస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఉల్లంఘనలు పునరావృతమయ్యే సందర్భంలో SR100,000 వరకు ఫైన్ విధిస్తామని వార్నింగ్ జారీ చేశారు. పట్టుబడిన ప్రవాసులపై దేశ నుంచి  బహిష్కరిస్తామన్నారు.  హజ్ నిబంధనలు మరియు సూచనలను ఉల్లంఘించిన వారిని రవాణా చేస్తూ పట్టుబడిన వారికి ఆరు నెలల వరకు జైలుశిక్ష,  గరిష్టంగా SR50,000  జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com