వరుణ్ సందేశ్ ‘నింద’.! ఇంత నెమ్మదిగానా.!
- May 17, 2024
‘హ్యాపీ డేస్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి యూత్ హీరోగా మారిపోయాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ తదితర సూపర్ హిట్లు ఆయన ఖాతాలో వున్నాయ్. అయితే, ఇప్పుడు వరుణ్ సందేశ్ కెరీర్ ఏమంత హ్యాపీగా లేదు.
ఏదో ఒకటీ అరా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు కానీ, అవి ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో అసలు కొన్ని సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి.
తాజాగా ‘నింద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. అయితే, వరుణ్ సందేశ్ వంటి హీరో నుంచి సినిమా అంటే, కాస్త రొమాన్స్.. హీరోయిన్‌తో డ్యూయెట్లు.. సరదా సరదా యూత్ సన్నివేశాలు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు.
కానీ, ఈ సినిమాలో అవేమీ వున్నట్లు కనిపించడం లేదు టీజర్ చూస్తుంటే. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ స్లోగా వుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. థ్రిల్లర్ కాన్సెప్టులు ఈ మధ్య బాగానే వర్కవుట్ అవుతున్నాయ్ కానీ, ప్రమోషన్స్ ఇంటెన్స్‌గా వుండాలి. కానీ, ‘నింద’ టీజరే చాలా స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి, సినిమా ఎలా వుంటుందో చూడాలిక.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







