నాని-సుజిత్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

- May 19, 2024 , by Maagulf
నాని-సుజిత్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

నాని సినిమాకి బడ్జెట్ కష్టాలా.? బడ్జెట్ కారణంగా నాని సినిమాని హోల్డ్‌లో పెట్టేశారా.? ఇవి నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా విషయంలో వస్తున్న ప్రచారాలు. అదేంటీ.! నాని సినిమాకి బడ్జెట్ కష్టాలేంటీ.!
‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టి నాని ఫుల్ హుషారుగా వున్నాడు. అలాంటిది తదుపరి సినిమాకి బడ్జెట్ కష్టాలేంటీ.? అనుకుంటున్నారా.?
ఏమో సినిమా దుస్థితి అలా తయారైంది. తెరపై కనిపించేదానికీ, తెర వెనక జరుగుతున్నదానికీ సంబంధం వుండడం లేదు. అయితే నాని సినిమా విషయానికి వస్తే.. సుజిత్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ సినిమాకి బడ్జెట్ కష్టాలున్నాయని ప్రాజెక్ట్ హోల్డ్‌లో పెట్టేశారనీ అంటున్నారు.
అయితే కేవలం అదంతా దుష్ప్రచారమే కానీ, అలాంటిదేమీ లేదనీ ఓ బడా నిర్మాత ఈ సినిమాని టేకప్ చేశాడనీ  అంటున్నారు. అయితే ఆ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కానీ, ఈ ప్రచారం నాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా వుంది. ఈ ప్రచారంపై నాని కానీ, డైరెక్టర్ సుజిత్ కానీ రెస్పాన్స్ అయితే బావుంటుందని ఆయన అభిమానులు కొందరు సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com