వైష్ణవీ చైతన్య.! సెలెక్షన్ కరెక్టేనా.!
- May 19, 2024
యూ ట్యూబర్‌గా పాపులర్ అయిన వైష్ణవీ చైతన్య ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. తొలి పరిచయమే ధీటుగా వుంది. దిమ్మ తిరిగే హిట్టు కొట్టింది. ఇక రెండో సినిమాగా ‘లవ్ మి’తో రాబోతోంది.
ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కాన్సెప్టే ఆలోచించేదగ్గదిగా అనిపిస్తోంది. దెయ్యంతో లవ్ స్టోరీ. ‘లవ్ మి - ఇఫ్ యు డేర్’ అనేది క్యాప్షన్.
దమ్ముంటే నన్ను లవ్ చేయ్ అంటోంది ఈ సినిమాలో దెయ్యం పాత్రలో వున్న వైష్ణవీ చైతన్య. ‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా నటిస్తున్నడీ సినిమాలో. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్సే అందుకుంటోంది.
అయితే, యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ వైష్ణవీ చైతన్య దెయ్యం రోల్‌లో మెప్పిస్తుందా.? అంటే ఆమెను అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు.
తొలి సినిమాకే ఛాలెంజింగ్ రోల్‌లో నటించి వందకు వంద మార్కులేయించేసుకుంది. సో, ఈ సినిమాలో దెయ్యం పాత్రతోనూ వైష్ణవి ప్రూవ్ చేసుకోగలదు.. అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!