భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు

- May 19, 2024 , by Maagulf
భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు

భారత్ లో రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.

కాగా.. ఐదో దశలో పలువురు ప్రముఖ రాజకీయ నేతల భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉంది. ఐదో దశంలో పోటీ చేసే వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణి ఆచార్య, ఒమర్ అబ్దుల్లా, పీయూష్ గోయల్ వంటి దిగ్గజాలు ఉన్నారు.

ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్ తో 379 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. కాగా.. ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com