మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- May 19, 2024
కొత్త కొత్త వేరియంట్లతో.. రోజుకో దేశంలో అలజడి సృష్టిస్తోంది కరోనా. తన కథ ఇంకా ముగిసిపోలేదంటూ.. మళ్లీ కోరలు చాచడం మొదలుపెట్టింది. ఉన్నట్లుండి ఒకేసారి వందల కేసులు నమోదు అవుతుండటంతో..అలర్ట్ అవుతున్నాయి వివిధ దేశాలు. ఇప్పుడు సింగపూర్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్‌డౌన్స్ పెట్టిన తర్వాత.. కరోనా ప్రభావం తగ్గింది. తర్వాత వ్యాక్సిన్లు రావడంతో జనం రిలీఫ్ అయ్యారు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసురుతున్నాయి. సింగపూర్‌లో వైరస్ టెన్షన్ పెడుతోంది. వారం రోజుల్లోనే అక్కడ 25 వేల 9వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది.
భయంకరంగా మారే అవకాశం
పెరుగుతోన్న కేసులతో పరిస్థితులు భయంకరంగా మారే అవకాశం ఉందని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. మరో నాలుగు వారాల్లో వైరస్ పీక్ లెవల్‌కు చేరుకుంటుందని..అలర్ట్‌గా ఉండాలని సూచించింది. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని ఆదేశాలిచ్చింది సింగపూర్ ప్రభుత్వం.
ప్రతిరోజూ 250 మంది కరోనా బాధితులు
మరోవైపు.. సింగపూర్ ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ 250 మంది కరోనా బాధితులు హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. పరిస్థితి చేయిదాటక ముందే హాస్పిటల్స్‌ను సిద్ధం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. బెడ్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు, అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేయాలని హాస్పిటళ్లకు సూచించింది. ఇక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, 60ఏళ్లపైబడినవారు కరోనా వ్యాక్సిన్‌ను తప్పకుండా వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది సింగపూర్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







