అమెరికాలో హైవేను శుభ్రం చేసిన NATS బృందం
- May 22, 2024
అమెరికా: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది.అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. టెంపాలోని ఎస్.ఆర్. 581/బ్రూస్ బీ డౌన్స్ బీఎల్విడి రెండు మైళ్ల హైవేను దత్తత తీసుకుని.. ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవేను శుభ్రపరిచారు. 35 మంది నాట్స్ సభ్యులు, స్థానిక ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు.ఈ కార్యక్రమంలో కేవలం పాఠశాల విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు పాల్గొని తమ సేవలు అందించారు. రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం అంతా తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ టంపాబే నాయకత్వం చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక అధికారులచే ప్రశంసలు పొందింది.
ఈ హైవే క్లీనింగ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి ,అనిల్ అరేమండ, భార్గవ్ మాధవరెడ్డి, ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ హైవే క్లీనింగ్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.
భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







