27 నిమిషాల్లో దుబాయ్ నుండి రస్ అల్ ఖైమాకు..!
- May 24, 2024
యూఏఈ: యూఏఈ ఆధారిత కంపెనీ త్వరలో అంతర్-ఎమిరేట్ ప్రైవేట్ హెలికాప్టర్ సేవను దేశంలో మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఎయిర్ చాటే ఇంటర్నేషనల్ ప్రయాణికులు దుబాయ్ నుండి రస్ అల్ ఖైమాకు 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. "మేము యూఏఈ అంతటా వివిధ ఎమిరేట్స్‌లో కనీసం ఆరు కొత్త హెలిపోర్ట్‌లను నిర్మిస్తాము" అని ఎయిర్ చాటేయు ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ సమీర్ మహమ్మద్ అన్నారు. ప్రయాణికులు అల్ మక్తూమ్ విమానాశ్రయంలోని మా సదుపాయానికి రావచ్చని, కేవలం 24 నుండి 27 నిమిషాలలో రస్ అల్ ఖైమాకు హెలికాప్టర్ చేరుకోవచ్చని తెలిపారు. తాము షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్ మరియు అబుదాబితో సహా అన్ని ఎమిరేట్స్‌ను కనెక్ట్ చేయడానికి ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ఎయిర్ చాటే యొక్క దుబాయ్ హెలిపార్క్, దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ విమానాశ్రయం పక్కనే ఉంది. ఇది దేశంలోనే అతిపెద్దది. ప్రస్తుతం ఎనిమిది హెలికాప్టర్‌లను ఇక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!