లగేజీ స్కాన్ తో భారీగా పట్టుబడ్డ నార్కోటిక్ పిల్స్
- May 24, 2024
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిత ప్రీగాబాలిన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ఖతార్ అధికారులు భగ్నం చేశారు. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ 1,400 పెర్గాబాలిన్ నార్కోటిక్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు డిపార్ట్‌మెంట్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. ప్రయాణికుడి బ్యాగేజీని మాన్యువల్‌గా తనిఖీ చేయగా, నిషేధిత పొగాకులో రహస్యంగా దాచిన మాత్రలను అధికారులు గుర్తించారు. ఖతార్‌లోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ అథారిటీ పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్‌ని తెలుసుకోవడానికి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







