‘విశ్వంభర’ కోసం గ్లామర్ మామూలుగా లేదుగా.!

- May 24, 2024 , by Maagulf
‘విశ్వంభర’ కోసం గ్లామర్ మామూలుగా లేదుగా.!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’లో ఓ రేంజ్ గ్లామర్ వుండబోతోందట. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఫాంటసీ నేపథ్యంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కాలాల్లో నడిచే స్టోరీగా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు వశిష్ట.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు నటించబోతున్నారట. ఇప్పటికే మెయిన్ లీడ్ హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. అలాగే, మరో ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్ పేరును తాజాగా ప్రకటించారు. వీరితో పాటూ మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, సురభి, రమ్య కొన్ని కీలక పాత్రలు పోషించబోతున్నారట.

ఎలా చూసుకున్నా.. ఈ ముద్దుగుమ్మలంతా హాట్‌నెస్‌లో అల్టిమేట్ అనే చెప్పొచ్చు. మరి, కథ పరంగా ఈ ముద్దుగుమ్మల్ని వశిష్ట ఎంతందంగా చూపించబోతున్నాడో చూడాలి మరి.

అన్నట్లు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఓ భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటూ త్రిష కూడా పాల్గొంటోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com