లేడీ పవర్ స్టార్ విజయ శాంతి ఇంకోస్సారి.!
- May 24, 2024
లాంగ్ గ్యాప్ తర్వాత లేడీ పవర్ స్టార్ సీనియర్ నటి విజయ శాంతి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇదో రకంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ కాదనాలి. ఎందుకంటే, ఈ సినిమాని ప్రత్యేకంగా తీసుకుని చేశారావిడ. అంతే కానీ, ఆ తర్వాత అనేక అవకాశాలొచ్చినా నటనను కంటిన్యూ చేయలేదు.
కానీ, ఇప్పుడు ఇంకోస్సారి ముఖానికి రంగేసుకోబోతున్నారట విజయ శాంతి. ఇదే ఇప్పుడు ఇండస్ర్టీ హాట్ టాపిక్. ఈ సారి చేయబోయే కాంబో అలాంటిలాంటి కాంబో కాదు మరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్ మూవీలో విజయ శాంతి నటించబోతున్నారట.
ఈ వార్త ఇలా బయటికొచ్చిందో లేదో, క్షణాల్లో ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా విజయ శాంతి నటిస్తున్నారా.? లేదా.? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావల్సి వుంది.
ఒకవేళ నిజంగా నిజమే అయితే, ఈ కాంబినేషన్ వేరే లెవల్‌లో వుండబోతుందనాల్సిందే. అన్నింటికీ మించి ఈ సినిమాలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ పోషించబోతున్నారట అనే గాసిప్ మరో హైలైట్. అది కూడా సాధ్యమైతే ఇంక మెగా ఫ్యాన్స్‌కి పండగ వేరే లెవల్ అంతే.!
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







