సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో ఎప్పుడంటే.!

- May 24, 2024 , by Maagulf
సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో ఎప్పుడంటే.!

లెక్కల మాస్టార్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటూ, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన సినిమాకీ ఈయన ఇన్‌పుట్స్ ఇవ్వాల్సి వుంది రామ్ చరణ్ సినిమాకి సంబంధించి.

అయితే, విజయ్ దేవరకొండ కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడు ఆయనతో ఓ సినిమా అనౌన్స్ చేశారు. హై లైఫ్ బ్యానర్‌లో ఆ సినిమా రూపొందాల్సి వుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి తాజాగా అందుతోన్న సమాచారమేంటంటే, ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాల్లేవని తెలుస్తోంది.

ఎందుకంటే, సుకుమార్ ఈ రెండు సినిమాలూ పూర్తి చేసేసరికి చాలానే టైమ్ పడుతుంది. అలాగే, విజయ్ దేవరకొండ కూడా రెండు మూడు ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగానే వున్నాడు. సో, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి మరి. కానీ, ఖచ్చితంగా ఈ కాంబోలో సినిమా అయితే వుంటుందని నిర్మాతలు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com