ఏందీ కేసుల లొల్లి.! అసలీ పెద్దాయనకి ఏమైంది.?
- May 24, 2024
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఏమైంది ఈ మధ్య.? తరచూ రాయల్టీ విషయంలో ఈ తరం దర్శకులు, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గుస్సా అవుతున్నారు.
తాజాగా మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ‘కమ్మని ఈ ప్రేమలేఖలే..’ అనే సాంగ్‌ని తన అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడేశారనీ అందుకు రాయల్టీ చెల్లించాలనీ లేదంటే కోర్టుకెళతాననీ ఆయన వివాదం లేవనెత్తారు.
‘మంజుమ్మల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా గత రెండు నెలల క్రితం రిలీజై వేరే కారణాల వల్ల వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం అందుకుంది. ఓటీటీలోనూ జనం బ్రహ్మరథం పట్టారీ సినిమాకి.
అయితే, ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇళయరాజా పెద్దాయన వచ్చి రాయల్టీ అదీ ఇదీ అంటూ వివాదం లేవనెత్తడం శోచనీయం. అయినా ఈ పెద్ద మనిషి ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలే తీసుకొస్తున్నారు. అయితే, చాలా కేసులు అయ్యవారి మాట దాటి కొట్టివేయబడుతున్నాయ్ కూడా.!
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







