గుమ్మడికాయతో జరంత జాగ్రత్త సుమీ.!
- May 24, 2024
గుమ్మడి కాయలో అనేక ఔషధ గుణాలున్నాయ్. గుమ్మడి కాయను కూరగా చేసుకుని తినేవారి సంఖ్య నిజానికి చాలా తక్కువే. కానీ, ఎన్నో ఔషధ గుణాలున్న గుమ్మడి కాయను తినడం ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. కానీ, డయాబెటిస్ వున్న వారు గుమ్మడి కాయను తినకూడదు.
ఇందులో అధిక GI వుండడం వల్ల అది రక్తంలో చక్కెర స్థాయుల్ని పెంచేస్తుంది. సో, అస్సలు గుమ్మడి కాయ జోలికి పోకూడదు డయాబెటిస్ వున్నవాళ్లు. అలాగే, గర్భిణీ స్త్రీలు
కూడా గుమ్మడి కాయను తినరాదని చెబుతున్నారు.
తింటే విపరీతమైన తలనొప్పి, కాళ్లు పీకుడు.. విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయట. అలాగే పాలిచ్చే తల్లులకి కూడా గుమ్మడి కాయ పెట్టొద్దంటారు. వీరు తినడం వల్ల పుట్టిన బిడ్డ ఆరోగ్యంపై అది ప్రభావం చూపే ప్రమాదముంది.
అలర్జీలూ, ఏసీడీటీ, గ్యాస్ సమస్యలు లేదా ఇతరత్రా జీర్ణ సంబంధ సమస్యలున్నవాళ్లు సైతం గుమ్మడి కాయ జోలికి పోకుండా వుంటేనే మంచిది.
కానీ, మిగిలిన వారు గుమ్మడి కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. గుమ్మడి కాయలోని జింక్, విటమిన్ సి, ఏ, బి కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, పాస్పారస్, ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయ్. అంతేకాదు, గుమ్మడికాయలో ఏకంగా 96 శాతం నీరుండడం వల్ల సమ్మర్‌లో డీ హైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







