ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం
- May 25, 2024
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచుకు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ప్రాక్టీసుకు దూరంగా ఉంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడడంతో పాటు చెన్నైలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో హైదరాబాద్ ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ చేయలేదు.
అలాగే, కోల్‌కతా నైట్‌రైడర్స్ చివరిసారిగా గత మంగళవారం మ్యాచ్ ఆడింది. ఆ జట్టు ఇప్పటివరకు మరో మ్యాచ్ ఆడకపోవడంతో టీమ్ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది.
ట్రోఫీతో ఫొటోలు
కోల్‌కతా, హైదరాబాద్ కెప్టెన్లు ఇవాళ ఐపీఎల్ 2024 ట్రోఫీతో ఫొటోలు దిగారు. శ్రేయాస్ అయ్యర్, కమిన్స్ ఫొటోలను ఐపీఎల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా, హైదరాబాద్ జట్లు మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాయి.
క్వాలిఫయర్ 1 మ్యాచులో కోల్‌కతా టీమ్ చేతిలో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. క్వాలిఫయర్ 2 రూపంలో హైదరాబాద్ తనకు ఉన్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని ఫైనల్ చేరింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







