5501 కార్డ్‌ల తొలగింపు..సివిల్ ID అప్డేట్ చేసుకోండి..!
- May 27, 2024
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) చిరునామా ఇచ్చిన భవనం కూల్చివేయడంతో దాదాపు 5,501 మంది వ్యక్తుల చిరునామా సిస్టమ్ నుండి తీసివేయనున్నారు. మే 26 నుండి 30 రోజుల వ్యవధిలోపు వారి కొత్త చిరునామాలను నమోదు చేసుకోవాలని PACI పిలుపునిచ్చింది. లేదంటే 1982 నాటి చట్టం నంబర్ 32లోని ఆర్టికల్ 33 ప్రకారం జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది ఒక వ్యక్తికి 100 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. వ్యక్తి 30 రోజులలోపు స్పందించకపోతే, కువైట్ మొబైల్ ID అప్లికేషన్ నుండి వారి సివిల్ కార్డ్ రద్దు చేయబడుతుంది. బాధిత వ్యక్తులు తమ కార్డ్ డేటాను అప్డేట్ చేయడానికి PACI ప్రధాన కార్యాలయం లేదా బ్రాంచ్‌లను తప్పనిసరిగా సందర్శించి, అద్దె ఒప్పందం, అద్దె రసీదు మరియు డేటాను ధృవీకరించే ఇంటి యజమాని నుండి ప్రకటనను సమర్పించాలని సూచించింది. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా సందర్శించకుండానే సాహెల్ అప్లికేషన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!







