బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ..

- May 27, 2024 , by Maagulf
బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ..

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో తేలిన వారికి విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో నటి హేమకూడా ఉన్నారు. హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో సోమవారం విచారణకు హాజరుకావాలని బెంగళూరు పోలీసులు హేమకు గత మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. అయితే, తాను విచారణకు హాజరుకాలేనని హేమ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను వైరల్ ఫివర్ తో బాధపడుతున్నట్లు బెంగళూరు సీసీబీకి లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఆ లేఖలో కోరారు. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి ఆమెకు నోటీసులు పంపించేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.

నటి హేమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా తన అభిమానులకు ఒక సందేశాన్ని పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో అబద్దాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఒకదానిమీద మరొక అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే వాదనతో హేమ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు నెటిజన్లు హేమకు వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com