సినిమా రివ్యూ: ‘లవ్ మి-ఇఫ్ యు డేర్’.!
- May 27, 2024‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా, ‘బేబీ’ సినిమాతో సంచలన విజయం అందుకున్న వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘లవ్ మి-ఇఫ్ యు డేర్’. ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయ్. ప్రమోషన్లు కూడా బాగా చేశారు. అంతేకాదు, టైటిల్ వున్న డేర్ రిలీజ్ టైమింగ్‌లోనూ చూపించారనుకుంటా.! ధియేటర్ల బంద్ ఓ పక్క, ఐపీఎల్, ఎలక్షన్స్ హంగామా.. ఇలా ఇంత గందరగోళంలోనూ ఈ సినిమాని ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు డేర్ చేశారు. మరి, సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా.? వైష్ణవీ చైతన్యకు డెబ్యూ ఇచ్చిన సక్సెస్ కంటిన్యూ అయ్యిందా.? తెలియాలంటే ‘లవ్ మి’ కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
రామ చంద్రపురం అనే ఊరిలో ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్లయిన జంట అద్దెకు దిగుతుంది. సహజంగానే కొత్తగా పెళ్లయిన జంట అంటే ఇరుగు పొరుగు వారికి కాస్త ఇంట్రెస్ట్ వుంటుంది. వాళ్లతో కలుపుకుపోవాలనుకుంటారు. అదే ఇంట్రెస్ట్ ఇక్కడా వుంటుంది .కానీ, ఆ జంటలో అమ్మాయి మాత్రం అసలు డోర్ తీసి బయట కనిపించిందే వుండదు. చుట్టు పక్కల వాళ్లు సైతం ఆ అమ్మాయిని అసలు చూసింది వుండదు. ఆరు నెలల తర్వాత ఆ అమ్మాయి మరణించిందని తెలుస్తుంది. అలా ఆ కథ కట్ చేస్తే, మరోవైపు దెయ్యాలూ, అడ్బెంచర్స్ వంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులతో ఓ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంటారు అన్నదమ్ములు ప్రతాప్ (రవికృష్ణ) మరియు అర్జున్ (ఆశిష్). ఈ క్రమంలో ప్రియ (వైష్ణవీ చైతన్య) ద్వారా దివ్యవతి అనే ఓ ఇంట్రెస్టింగ్ దెయ్యం కథ తెలుసుకుంటారు. ఆ దెయ్యం సంగతి చూడాలని ప్రియ చెప్పిన గుర్తులతో ఓ పాడుబడిన అపార్ట్రరరమెంట్‌లోకి వస్తాడు ఆశిష్. అలా ఆ దెయ్యంతో ప్రేమలో పడతాడు. మరి, దెయ్యం ప్రేమలో పడ్డ ఆశిష్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు.? అసలు మొదట చెప్పుకున్న కథకీ, ఈ దివ్య వతి కథకీ ఏంటి సంబంధం.? అనేది తెలియాలంటే ‘లవ్ మి-ఇఫ్ యు డేర్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
హీరో ఆశిష్ తొలి సినిమాకీ ఈ సినిమాకీ చాలా ఇంప్రూవ్‌మెంట్ చూపించాడు తన నటనలో. అలాగే, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లోనూ పతాక సన్నివేశాల్లోనూ తనదైన హావభావాలు ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక, వైష్ణవి గురించి చెప్పాలంటే 100 పర్సెంట్ పర్‌ఫామెన్స్ ఇచ్చింది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్‌లో కట్టిపడేసింది. క్లైమాక్స్‌లో పీక్స్‌కి వెళ్లింది ఆమె నటన. అయితే, ఆమె క్యారెక్టర్‌ని డిజైన్ చేయడంలో చాలా లోపాలుండడం ఈ సినిమాకి పెద్ద మైనస్. అలాగే మరో హీరోయిన్ రోల్ పోషించిన సిమ్రాన్ చౌదరి తనకున్న పరిధిలో బాగానే నటించింది. రవికృష్ణ ఇలాంటి పాత్రల్లో తనదైన అనుభవాన్ని రంగరించి మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు అరుణ్ భీమవరపు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. చాలా దెయ్యం కథలు చూశాం కానీ, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మెయిన్ థీమ్ ఆసక్తికరమైనదే. అయితే, తాను ఎంచుకున్న డిఫరెంట్ లవ్ స్టోరీని, హారర్ కాన్సెప్ట్‌కి కనెక్ట్ చేస్తూ కథనం నడిపించడంలో కాస్త తడబడ్డాడు డైరెక్టర్. కథని ఎత్తుకోవడం... అలాగే ఫస్టాఫ్ వరకూ చాలా ఆసక్తికరంగా నడిపించాడు. సెకండాఫ్‌ని డీల్ చేయడంలో ఫెయిలయ్యాడు. కథలో వచ్చే సస్పెన్సులు, కొన్ని కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయ్. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ బాగా మిస్సయ్యింది ఈ సినిమాలో. కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింటే అని చెప్పొచ్చు. విజువల్‌గానూ పాటలు బాగున్నాయ్. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
వైష్ణవీ చైతన్య పర్‌ఫామెన్స్, కథ థీమ్, ఆసక్తికరంగా అనిపించిన కొన్ని సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సన్నివేశాలు.. ఫస్టాఫ్, క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో రొటీన్‌గా అనిపించిన సన్నివేశాలు, తదుపరి సన్నివేశం ఏం జరుగుతుందా.. అని ప్రేక్షకుడి ఊహకు అందేలా వుండడం..
పైనల్‌గా:
‘లవ్ మి - ఇఫ్ యు డేర్’ జస్ట్ ఓకే బాగా థ్రిల్ ఆశిస్తే నిరాశే.. కానీ, ఓ కొత్త దెయ్యం ప్రేమ కథ.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!