నిఖిల్ హీరోయిన్‌కి అలాంటి తేడాల్లేవంట.!
- May 28, 2024
‘స్పై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఐశ్వర్యా మీనన్. నిజానికి అంతకు ముందే ‘లవ్ ఫెయిల్యూర్’, ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ సినిమాల్లో నటించింది.
కానీ, ‘స్పై’ సినిమాతోనే పాపులర్ అయ్యింది. త్వరలోనే ‘భజే వాయు వేగం’ సినిమాతో రాబోతోంది. కార్తికేయ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెలాఖరుకు ధియేటర్లలో సందడి చేయనుంది.
కాగా, ఈ ముద్దుగుమ్మకు పవర్ ఫుల్ రోల్స్ అంటే చాలా ఇష్టమట. ‘స్పై’ మూవీలో హీరోకి ధీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ అలరించింది. అలాగే, కుటుంబ తరహా పాత్రల్లోనూ ఇట్టే మ్యాచ్ అయిపోతుంటుంది ఐశ్వర్యా మీనన్.
ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ, మలయాళ సినిమాలపైనా ఫోకస్ పెట్టింది ఐశ్వర్యా మీనన్. ఆ క్రమంలోనే మలయాళ సీనియర్ హీరో ముమ్ముట్టి సినిమాలో నటిస్తోంది. కథ నచ్చితే తనకు సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేవంటోంది. అవకాశాలు రావాలే కానీ, టాలీవుడ్‌లోనూ సీనియర్ హీరోల సరసన నటించడానికి తనకెలాంటి అభ్యంతరాల్లేవని కుండ బద్దలు కొట్టేస్తోంది ఐశ్వర్యా మీనన్.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!