మరోసారి వాయిదా పడిన అగ్నిబాణ్ రాకేట్ ప్రయోగం
- May 28, 2024
న్యూఢిల్లీ: ఏపి తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వాయిదావేశారు. దీంతో నాలుగోసారీ రాకెట్ ప్రయోగం వాయిదాపడినట్లయింది.
చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ (సార్టెడ్) రాకెట్ ప్రతిష్ఠత్మాకంగా రూపొందించింది. సొంత లాంచ్‌ప్యాడ్ ఏర్పాటుచేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలనుకున్నది. షెడ్యూల్ ప్రకారం 8 గంటల కౌంట్‌డౌన్ అనంతరం మంగళవారం ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉన్నది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో ప్రయోగాన్ని నిలిపివేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







