అల్లరోడు స్పీడు పెంచాడు.! కొత్త అవతారం చూశారా.?
- May 28, 2024
లేటెస్ట్‌గా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో హిట్ కొట్టిన అల్లరి నరేష్ తాజాగా ‘బచ్చల మల్లి’గా రాబోతున్నాడు. ఈ మధ్య అల్లరి నరేష్ దూకుడు చూపిస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ వెంటాడడం వల్ల సీనియర్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించిన అల్లరి నరేష్ మళ్లీ సోలో హీరో అవతారమెత్తాడు.
అది కూడా తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీస్‌ని ఎంచుకుంటున్నాడు. అలా వచ్చిన సినిమానే ‘ఆ ఒక్కటీ అడక్కు’. బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మాస్ అవతారమెత్తబోతున్నాడు. ఆ అవతారం పేరే ‘బచ్చల మల్లి’. పేరు ‘మల్లి’. ఇంటి పేరు ‘బచ్చల’. చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్’.. ఈ బచ్చల మల్లి చాలా కాలం పాటు అందరికీ గుర్తుండిపోతాడు..’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ రిక్షాలో కూర్చొని బీడీ తాగుతూ పక్కా మాస్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాని ‘ఊరు పేరు భైరవకోన’ ఫేమ్ రాజేష్ దండా నిర్మిస్తుండగా, సుబ్బు (సోలో బతుకే సో బెటర్’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు. ‘హనుమాన్’తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!