‘కాల్ మి బె’ అంటోన్న రౌడీ హీరోయిన్.!
- May 28, 2024
‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. అన్నీ కుదిరితే తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ హీరోయిన్ అయిపోయుండేది ఈ పాటికి. కానీ, లక్కు కలిసి రాలేదు. ‘లైగర్’ భారీ డిజాస్టర్ కావడంతో మరో ఛాన్స్ ఇచ్చి చూడలేదు అనన్యా పాండేకి మన తెలుగు మేకర్లు.
అయితే, సినిమా చూసినోళ్లంతా అనన్య పాత్ర బాగుందన్న ప్రశంసలు కురిపించడం విశేషం. నిజమే ఈ ముద్దుగుమ్మ మంచి నటి. బాలీవుడ్లో ఆమె నటించిన గత చిత్రాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. గ్లామర్తో పాటూ మంచి పర్ఫామెన్స ఇవ్వగల కెపాసిటీ వుంది అనన్యకు.
అసలు మ్యాటర్ ఏంటంటే, అనన్య త్వరలో ఓటీటీ తెరపై వెలుగులు విరజిమ్మబోతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లంతా ఓటీటీ తెరపై సత్తా చాటుతున్నారు. త్వరలో అదే దారిలో అనన్య పాండే కూడా నడవబోతోంది.
అనన్య నటించిన ‘కాల్ మి బె’ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అనుకోని కారణాలతో కుటుంబానికి దూరమైన ఓ అమ్మాయి ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా రూపొందింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..