జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి.!
- May 28, 2024
ఇటీవల కాలంలో జుట్టు సమస్యలు చాలా తీవ్రతరమయ్యాయ్. వయసుతో సంబంధం లేకుండానే తెల్ల జుట్టు సమస్యలు, బట్ట తల, జుట్టు రాలిపోవడం.. ఇలా అనేక జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అయితే, జుట్టు అనారోగ్యానికి కారణాలేంటీ.? ఏ పోషకాలు లోపిస్తే జుట్టు అనారోగ్యంగా నిర్జీవంగా మారిపోతుంది.? ఏ ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ‘ఎ’, విటమిన్ బి కాంప్లెక్స్, ప్రొటీన్స్, జింక్ వంటివి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయ్. జుట్టు బలహీనంగా వుండడానికి కారణం ముఖ్యంగా ప్రొటీన్ లోపమే అంటున్నారు సంబంధిత నిపుణులు. సో, ప్రొటీన్స్ ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బలహీన సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.
పాలు, పాల సంబంధిత ఆహారాలు, ఉడకబెట్టిన కోడి గుడ్లు తినడం వల్ల సరిపడినంత ప్రొటీన్లు శరీరానికి అందుతాయ్. తద్వారా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అలాగే, జింక్ సంబంధిత ఆహారాలు.. పండ్లు కూరగాయలు, ఆకుకూరలు సరిపడినంత మోతాదులో తీసుకుంటే జుట్టు సమస్యల నుంచి బయట పడొచ్చు.
అలాగే వాల్ నట్స్, బఠానీ, చిరు ధాన్యాల్లో బి కాంప్లెక్స్ అధికంగా వుంటుంది. వీటిని ప్రతీరోజూ డైట్‌లో చేర్చుకుంటే, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







