కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- May 28, 2024
తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఇప్పటికే రికార్డింగ్ సెషన్స్ కూడా మొదలైనట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు అని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







