అన్న ప్రేమ వ్యవహారంపై పెదవివిప్పిన ఆనంద్ దేవరకొండ
- May 28, 2024
విజయ్ దేవరకొండ, రష్మిక మందన రిలేషన్ గురించి ఎన్ని వార్తలు ఇప్పటి వరకు వచ్చి ఉంటాయో లెక్కేలేదు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. చేస్తున్నప్పుడే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది అనే ప్రచారం ఉంది. తర్వాతి కాలంలో వీరిద్దరూ వేరువేరుగా తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు ఒకే బ్యాగ్రౌండ్ లో కనిపిస్తూ ఉండడంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళుతున్నారనే ప్రచారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయం మీద ఆనంద్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అదే సినిమాలో కీలక పాత్రలో నటించిన జబర్దస్త్ ఇమ్మానుయేల్ తో కలిసి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రెండో ఇంటర్వ్యూ తాజాగా రిలీజ్ అయింది.
ఈ ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండని ఇదే ప్రశ్న అడిగాడు ఇమ్మానియేల్. విజయ్ దేవరకొండ రష్మిక ఒకే రిసార్ట్ లో ఉన్నట్లు నా దగ్గర ఫోటోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయి అని ఆనంద్ చెప్పుకొచ్చాడు. అంతేకాక బహుశా అది కో ఇన్సిడెన్స్ అయి ఉండవచ్చు అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. అంతేకాక ఒకే రిసార్ట్ కి ఇద్దరూ ఎలా వెళ్లారు? అని అడిగితే దూరం కదా ఫ్లైట్లో వెళ్లారు అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అడిగితే మాత్రం ఆ సీక్రెట్ ఇక్కడ చెప్పొచ్చా అని అడిగి చివరికి తర్వాతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తోందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఆనంద్ దేవరకొండ మాటలతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చినట్లు అయింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







