జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్

- June 01, 2024 , by Maagulf
జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్

యూఏఈ: యూఏఈలో జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరుసగా 20వ సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈ అంతటా మధ్యాహ్నం 12.30 నుండి 3.00 గంటల మధ్య డైరెక్ట్ సూర్యకాంతిలో, బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం.  మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు 5,000 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పని చేస్తే 50,000 దిర్హామ్‌ల ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు.  అయితే, కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. నీటి సరఫరా లేదా విద్యుత్తు, ట్రాఫిక్‌ను నిలిపివేయడం, రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీటు పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర పనులు మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు. కాగా, విరామ సమయంలో పని కొనసాగించడానికి కంపెనీలు అనుమతి కోసం అప్లే చేసుకోవాలని సూచించారు. డైరెక్ట్ సూర్యకాంతిలో పనిచేసే ఉద్యోగులను రక్షించడానికి యజమానులు పారాసోల్‌లు,  షేడెడ్ ఏరియాల వంటి వాటని సమకూర్చాలి. జాబ్ సైట్‌లలో ఫ్యాన్లు మరియు తగినంత తాగునీరు, అలాగే ప్రథమ చికిత్స పరికరాలను అందుబాటులో పెట్టాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ (MoHRE) మంత్రిత్వ శాఖలో తనిఖీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సిన్ అల్ నస్సీ వివరించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com