సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
- June 01, 2024
న్యూ ఢిల్లీ: సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని.. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రేపు జరిగే ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







