తమిళ లో కూడా ఇరగదీస్తున్నా జగపతిబాబు..
- June 11, 2016
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేసి ప్రస్తుతం విలన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు ప్రజెంట్ సౌత్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ముఖ్యంగా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు అదే స్ధాయి విలన్ కావాలంటే జగపతిబాబే బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్.
ఇప్పటికే తెలుగులో మంచి క్యారెక్టర్స్ తో ఆకట్టుకున్న జగపతి బాబు, ఇప్పుడు తమిళ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమాకు సంబందించి జగ్గుబాయ్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్న జగపతి బాబుని చూస్తుంటే అక్కడ కూడా జెండా పాతేలాగే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాండవం సినిమాలో చిన్న పాత్ర చేసిన జగపతిబాబు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తరువాత చేసిన లింగా కూడా నిరాశపరచటంతో కొద్ది రోజులు కోలీవుడ్ కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి తమిళ నాట తన విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు జగ్గుభాయ్.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







