మహిళా కార్మికులు - లాఫింగ్ యోగా
- June 11, 2016
పలు షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులు పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే లాఫ్టర్ యోగా. ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీ మరియు అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఓ ఇన్‌స్ట్రక్టర్ ఒత్తిడిని తట్టుకునేందుకు లాఫ్టర్ యోగా ఎలా చెయ్యాలో చేసి చూపించారు. క్యాన్సర్ కారణంగా తన భర్తను పోగొట్టుకున్న శ్రీలంకకు చెందిన 48 ఏళ్ళ మార్గరెట్టా, మానసికంగా తాను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందనీ, తన కుమార్తె ఇప్పుడు క్యాన్సర్‌తో బాధపడ్తోందని లాఫ్టర్ యోగా ద్వారా ఒత్తిడిని జయించగలుగుతున్నానని చెప్పారు. వరుసగా రెండో ఏడాది ఈ లాఫ్టర్ యోగా లేదా హాస్య యోగాను నిర్వహిస్తున్నామనీ, మహిళా కార్మికుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఇది ఉపయోగపడ్తుందని ఐఎల్‌ఎ ప్రెసిడెంట్ సునీతా వాగ్లే చెప్పారు. ముసాఫ్పాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న 45 మంది మహిళా కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాయిగా నవ్వుతూ, మ్యూజిక్‌కి తగ్గట్లుగా డాన్స్ చేస్తూ ఒత్తిడిని దూరం చేసుకున్న మహిళా కార్మికులు, తమకు కొండంత బలం వచ్చినట్లయ్యిందని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







