కెఆర్ ఆర్ క్లాస్ రూమ్ పేరుతో దర్శకేంద్రుడు..
- June 11, 2016
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, తన అనుభవాన్ని పాఠాలుగా నేర్పించడానికి సిధ్దమయ్యారు. చాలా కాలం క్రితమే కెఆర్ ఆర్ క్లాస్ రూమ్ పేరుతో ప్రొమో రిలీజ్ చేసిన దర్శకేంద్రుడు. తాజాగా తన తొలి ఎపిసోడ్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో దర్శకుడు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..? స్క్రీప్ట్ ను ఎలా అర్థం చేసుకోవాలి..? తానెలా డైరెక్టర్ అయ్యాను..? అనే అంశాలను ప్రస్థావించారు.అంతేకాదు ఎపిసోడ్ చివరలో.. తన ముందున్న టేబుల్ మీద నంది అవార్డుతో పాటు డబ్బుల కట్టలను ఎందుకు పెట్టానో కామెంట్ చేయండి అంటూ ప్రేక్షకులకు పజిల్ వేశారు. దర్శకేంద్రుడి తొలి పాఠంపై ఆయన శిష్యుడు రాజమౌళి స్పందించారు. 'మీరు చెప్పిన పాఠం నేను అసిస్టెంట్ గా పనిచేసిన రోజులకు సరిగ్గా సరిపోతుంది.
క్రాంతిగారి దగ్గర పనిచేసినప్పుడు నేను బెరుగ్గా ఉండేవాణ్ని, మీ దగ్గర పని చేసే సమయంలో కొంత యాక్టివ్ అయ్యాను. అదే నా తొలి విజయానికి కారణం అయ్యింది. అందుకే సహాయ దర్శకుడు యాక్టివ్ గా ఉండటంతో పాటు అన్ని విషయాలను గమనిస్తూ ఉండాలి'. అంటూ ట్వీట్ చేశారు. కెఆర్ ఆర్ క్లాస్ రూమ్ తొలి ఎపిసోడ్ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన రాజమౌళి. '50 ఏళ్ల అనుభవాన్ని కొన్ని నిమిషాలకు కుదించి చెపుతున్నారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నవారు తప్పక చూడాల్సిన వీడియో' అంటూ కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







