సినిమా రివ్యూ: ‘మనమే’

- June 07, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మనమే’

‘ఒకే ఒక జీవితం’ సినిమా తర్వాత శర్వానంద్ నుంచి సినిమా రాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత శర్వా నటించిన చిత్రమే ‘మనమే’. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రొజెక్ట్ అయిన ఈ సినిమా ఎలా వుంది.. అని తెలియాలంటే కథేంటో తెలియాల్సిందే.

కథ:
విక్రమ్ (శర్వానంద్) ఎటువంటి బాధ్యత లేకుండా ఓ ప్లే బాయ్‌గా తిరుగుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో స్నేహితుడి కుటుంబం యాక్సిడెంట్‌లో చనిపోవడంతో, వాళ్ల కొడుకు విక్రమాదిత్య(బాబు) బాధ్యతను శర్వానంద్ తీసుకోవల్సి వస్తుంది. అలాగే, తన స్నేహితుడి భార్యకు స్నేహితురాలు అయిన సుభద్ర (కృతి శెట్టి)తోనూ రిలేషన్ షిప్‌లో వుండాల్సి వస్తుంది. పిల్లలు, బాధ్యత అంటే చిరాకు పడే విక్రమ్‌కి ఆ బాబును అస్సలు వదులుకోలేని పరిస్థితి ఎందుకొస్తుంది.? సుభద్రతో ఇష్టం లేకుండానే రిలేషన్‌షిప్ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది.? అసలు బాధ్యతలే ఇష్టం లేని విక్రమ్.. ఆ బాబుపై ప్రాణం పెట్టుకోవల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది.? సుభద్రతో ప్రేమలో పడే పరిస్థితి ఎలా వచ్చింది.? చివరికి ఈ ముగ్గురి కథ ఏ మలుపు తిరిగింది.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
శర్వానంద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేముంది.! ఎలాంటి రోల్‌లోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. అయితే, ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో అసలు శర్వానందేనా నటించింది.! అనేంతలా అనుమానం కలుగుతుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బాథ్యతలేని అద్దె తండ్రి పాత్రలోనూ అలాగే, బాధ్యత తెలిసి ఆ బాబును కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్లే బాద్యత గల వ్యక్తిగా అనేక రకాల వేరియేషన్స్‌లో శర్వానంద్ బాగా నటించి మెప్పించాడు. అలాగే కృతి శెట్టి కూడా తన పాత్రలో లీనమైప్ోయి నటించింది. అందంగా కనిపిస్తూనే మంచి పర్‌ఫామెన్స్ ఇచ్చింది. చిన్న బాబు క్యూట్‌గానే కనిపిస్తూ అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేశాడు. వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితర కమెడియన్లను ఇంకా బాగా వాడి వుంటే బాగుండేది. మరింత ఫన్ జనరేట్ అయ్యేది. శర్వా - క‌ృతి జంట క్యూట్‌గా అనిపించింది. కెమిస్ట్రీ బాగా పండింది. మిగిలిన పాత్రధారులు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
శ్రీరామ్ ఆదిత్య మంచి పని తనం వున్న దర్శకుడు. ఈ తరహా కథల్ని గతంలో చాలానే చూశాం. కానీ, కథనాన్ని శర్వా వంటి హీరోతో డిఫరెంట్‌గా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలతో ఫస్టాఫ్ అంతా ఫన్‌గా నడిచిపోతుంది. సెకండాఫ్ కాస్త స్లోగా అనిపించినా ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చదగ్గ ముగింపునిచ్చాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా బ్రైట్‌గా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. హేషమ్ అబ్ధుల్లా మ్యూజిక్ మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో కాస్త సాగతీత సన్నివేశాలున్నాయ్. వాటిని కాస్త కత్తిరిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కామెడీ, శర్వా పర్‌ఫామెన్స్, శర్వానంద్ - కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్, విజువల్స్..

మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు, అవకాశముండీ వాడుకోలేని కొన్నికామెడీ పాత్రలు..

చివరిగా:
‘మనమే’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ సినిమా. యూత్‌నీ ఎట్రాక్ట్ చేయగలిగితే శర్వా కంప్లీట్ సక్సెస్ అయినట్లే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com