ఆల్ ది బెస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ వెంకీ ట్వీట్ వైరల్

- June 07, 2024 , by Maagulf
ఆల్ ది బెస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ వెంకీ ట్వీట్ వైరల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా విజయం సాధించడం పట్ల అభిమానులు, పార్టీ శ్రేణులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం ఎంతో సంతోష పడుతున్నారు. చిత్రసీమలో అగ్ర హీరోగా రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సత్తా ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి..గత పదేళ్లుగా రాజకీయాలు చేస్తూ..సొంత డబ్బును ప్రజలకు పంచిపెడుతూ వస్తున్న పవన్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని కోరుకున్నారు. అందరి కోరిక మేరకు ఈరోజు పిఠాపురం నుండి 70 వేలఫై చిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరో వెంకటేష్ స్పందించారు. “ప్రియమైన పవన్ కల్యాణ్… చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ వెంకీ ట్వీట్ చేశారు. అంతేకాదు… మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్ గతంలో ‘గోపాల గోపాల’ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

అలాగే మహేష్ బాబు సైతం ..”పవన్ కల్యాణ్ గారూ… మీ అద్భుత విజయానికి అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకం, విధేయతకు మీ విజయమే నిదర్శనం. ప్రజాసేవ దిశగా మీ కలలు సాకారం కావాలని, మీ పదవీకాలం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఎక్స్ లో స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com