200 మంది బహ్రెయిన్ యాత్రికుల బహిష్కరణ
- June 08, 2024
మనామా: సరైన అనుమతులు లేకుండా హజ్ యాత్ర కోసం మక్కాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 200 మంది బహ్రెయిన్ పౌరులను సౌదీ అధికారులు బహిష్కరించారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నది. ఈ వైరల్ వీడియోలో బహ్రెయిన్‌లను పవిత్ర భూమి నుండి బయటకు తీసుకెళ్లి జెద్దాకు రవాణా చేయడాన్ని చూపించారు. ఈ ఆపరేషన్‌లో హోటళ్లపై దాడులు, బస్సులు మరియు రైళ్ల ద్వారా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నట్లు కనిపిస్తున్నది. పట్టుబడిన వారిలో పది మంది లైసెన్స్ పొందిన హజ్ ట్రావెల్ గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, మరికొందరు స్వతంత్రంగా అనుమతి నిబంధనలను తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







