టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- June 12, 2024
హైదరాబాద్: 2024 లో జరిగిన టీజీ టెట్ పలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా, 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధించారని అధికారులు వివరించారు.
పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు పేర్కొన్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఇదిలా ఉండగా టెట్ లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వచ్చే టెట్ ఎగ్జామ్‌కు అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే టెట్ అలాగే టెట్ లో అర్హత సాధించిన వారికి కూడా ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







