ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..
- June 13, 2024
న్యూ ఢిల్లీ: మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయల్దేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు.
ఇటలీలోని ఏప్యూలియాలో జరిగే జీ7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సు జూన్ 14 న జరగనుంది.ఈ సదస్సు సందర్భంగా, ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం, తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







