తెలంగాణ వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
- June 13, 2024
హైదరాబాద్: తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
గ్రామైక్య సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బెంగాల్లోని దీదీ కా రసోయ్, కేరళలోని క్యాంటీన్లపై ఇప్పటికే అధ్యయనం చేసినట్లు సీఎస్ వివరించారు. వీటి నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళ శక్తి క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, అవసరమైన స్థలం తదితర వివరాలతో రోడ్ మ్యాప్ తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







