ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయింపు..
- June 14, 2024
అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి ఏఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠతకు తెరదించుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు.
- చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు)
- కొణిదెల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
- నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టీజీ
- కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ
- కొల్లు రవీంద్ర – గనులు అండ్ జియాలజీ, ఎక్సైజ్
- నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
- పి.నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్
- వంగలపూడి అనిత – హోంశాఖ, విపత్తు నిర్వహణ
- సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ
- నిమ్మల రామానాయుడు – జలవనరుల అభివృద్ధి శాఖ
- ఎన్.ఎమ్.డి.ఫరూక్ – మైనార్టీ, న్యాయశాఖ
- ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయశాఖ
- పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు
- అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ
- కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ
- డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ
- గొట్టిపాటి రవి కుమార్ – విద్యుత్ శాఖ
- కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ
- గుమ్మడి సంధ్యారాణి – గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ
- బీసీ జనార్థన్ రెడ్డి – రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు
- టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం
- ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి
- వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
- కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు

తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







