టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు..
- June 14, 2024
అమరావతి: ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా నియమితులు కావడంతో అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నేడు నియమించింది. దీనిపై పల్లా శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
“తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు కృతజ్ఞతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను వెన్నుతట్టి నడిపిస్తున్న కార్యకర్తలకు, గాజువాక ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







