విజయవాడ-ముంబై విమాన సర్వీస్ ప్రారంభం
- June 15, 2024
విజయవాడ: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబై నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ నూతన సర్వీసును నేటి(శనివారం) నుంచి ప్రారంభించనుంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గతంలో పలుమార్లు విజయవాడ నుంచి ముంబై నగరానికి విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని, అధికారులను కలిశారు.
ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శనివారం నాడు గన్నవరం నుంచి ముంబై నగరానికి విమాన సర్వీసు ప్రారంభం కానుంది. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ఎయిర్ ఇండియా వారి విమాన సేవలను ప్రారంభం కానుండగా.. ఈ విమాన సర్వీసును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం విజయవాడ నుంచి ముంబైకి, ముంబై నుంచి విజయవాడ వచ్చేందుకు వీలుకలగుతుంది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







