చిరు ఫిల్మ్ స్టూడియో హైదరాబాద్ లో..
- June 11, 2016
ఆట, పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి, 150వ చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుంటుండగా.. 20న ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్టు సమాచారం. ఇక ఆ తర్వాత అంటే ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే కూడా ఉండడంతో ఈ డబుల్ బొనాంజాని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరు బర్త్ డే వేడుకలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఆగస్ట్ 14 నుండి ఆగస్ట్ 22 వరకు ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపనున్నట్టు సమాచారం. కాణిపాకం, విజయవాడ, అంతర్వేది, శ్రీకాకుళం, వైజాగ్, జంగారెడ్డి గూడెం, సికిందరాబాద్, హైదరాబాద్ ..ఇలా పలు ప్రాంతాలలోని దేవాలయాలలో తొమ్మిది రోజుల పాటు అభిమానులు పూజలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వాటికి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 14 ఆగస్ట్ నుండి 22 ఆగస్ట్ వరకు ప్రతి రోజు ఒక్కో ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి ప్రస్తుతం ఓ అవార్డ్ ఫంక్షన్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రిహార్సల్ చేస్తున్నట్టు వినికిడి. ఈ అవార్డ్ వేడుక జూన్ 12న జరగనుంది. ఇంక మరో విశేషమేమంటే చిరంజీవి హైదరాబాద్ అవుట్ స్కట్స్లో కొణిదెల ఫిల్మ్ స్టూడియోను స్థాపించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







