జూన్ 24న తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
- June 18, 2024
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు తెలిపింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 60కి పైగా కంపెనీల్లో 5 వేల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తిరుమల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ జాబ్ మేళాలో 18-35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించింది.
విద్యార్హతలు:
7వ తరగతి నుంచి 12వ అండర్ గ్రాడ్యూయేట్, డిప్లొమా హోల్డర్, బిఫార్మా, ఎంఫార్మా, హోటల్ మేనేజింగ్, డ్రైవర్స్, బీఇ, బిటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఎ, ఎంపిఎస్, పోస్ట్ గ్రాడ్యూయేట్ అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి తెలంగాణ)
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







